Ram Charan: చిరు లీక్స్‌లా నేనేమీ లీక్ చేయను.. అనస్వరపై రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన స్టైల్‌లో సరదా వ్యాఖ్యలు చేస్తూ అభిమానులను నవ్వించారు. అనస్వర రాజన్ గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమా విశేషాలను సరదాగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో అనీష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'ఇట్లు అర్జున'. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుండగా.. వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వివరాలు
'చిరు లీక్స్‌లా నేనేమీ లీక్ చేయను'
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కార్యక్రమంలో నవ్వులు పూయించాయి. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. అనస్వర రాజన్‌ను 'ఛాంపియన్' సినిమా సమయంలో కలిశానని తెలిపారు.
ఇటీవల ఆమె నటనను స్వయంగా చూశానని చెప్పారు. అంతేకాకుండా అనస్వర.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు.
'మీకు తెలుసో లేదో.. అనస్వర కాకా సినిమాలో డాడీతో కలిసి నటిస్తున్నారు. సినిమాలో డాడీ, అనస్వర మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి మాత్రం చెప్పను.
చిరు లీక్స్‌లా నేనేమీ లీక్ చేయను. కాకాలో ఆమె ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు'' అంటూ చరణ్ సరదాగా వ్యాఖ్యానించారు.
వివరాలు
'ఇట్లు అర్జున' బ్లాక్‌బస్టర్ పక్కా.. చరణ్ ధీమా
దీంతో కార్యక్రమ ప్రాంగణం నవ్వులతో మార్మోగింది. అక్కడున్న అభిమానులు ఈలలు, కేకలతో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాకా' సినిమాలో అనస్వర కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అనంతరం 'ఇట్లు అర్జున' సినిమా గురించి రామ్ చరణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. నవంబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
'మీరు రాసిపెట్టుకోండి.. ఇట్లు అర్జున బ్లాక్‌బస్టర్ పక్కా. అనస్వర రాజన్ మళ్లీ సంక్రాంతికి మరో హిట్ కొడతారు. అది కూడా రాసిపెట్టుకోండి. ఆమె ఈ సినిమాలో చాలా బాగా నటించారంటూ ప్రశంసలు కురిపించారు.
రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.