Page Loader
మామా కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్.. నాగార్జునసాగర్‌లో సందడి చేసిన ఐకాన్ స్టార్
మామా కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్..నాగార్జున్ సాగర్‌లో సందడి చేసిన ఐకాన్ స్టార్

మామా కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్.. నాగార్జునసాగర్‌లో సందడి చేసిన ఐకాన్ స్టార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2023
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నల్గొండలో శనివారం సందడి చేశారు. బీఆర్ఎస్ నేత, తన మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం దగ్గర నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని భట్టుగూడెం వద్ద 'కంచర్ల కన్వేషన్' పేరుతో ఫంక్షన్ హాల్‌ను నిర్మించారు. ఆధునిక వసతులతో 1000 మందికి సరిపడేలా ఈ ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఊరికి మంచి చేయాలనే ఉద్ధేశంతో ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తున్న ఆయనకు ధన్యవాదాలని, తాను అభిమానులను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్పష్టం చేశారు.

Details

గజమాలతో స్వాగతం పలికిన అభిమానులు

ఈ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్‌కి అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం గజమాలతో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా, వచ్చే ఎన్నికల్లో నాగార్జున్ సాగర్ నుంచి పోటీ చేస్తానని, తన గెలుపు కోసం బన్నీ చేస్తాడని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో మామ కోసం అల్లుడు ప్రచారం చేస్తాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రశేఖర్ రెడ్డికి నాగార్జున సాగర్ బీఆర్ఎస్ టికెట్ ఇంకా కన్ఫామ్ కాలేదు.