Loading...
Idhupu Kayitham: డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు 'ఇడుపు కాయితం'..
డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు 'ఇడుపు కాయితం'..

Idhupu Kayitham: డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు 'ఇడుపు కాయితం'..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ మాండలికంలో వినిపించే ప్రత్యేకమైన పదమైన 'ఇడుపు కాయితం' పేరుతో రూపొందుతున్న సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రారంభ వేడుక జరిగిన నాటి నుంచే ఈ చిత్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. జానపద గీతాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, ప్రియదర్శి హీరోగా కనిపించనున్నారు. తెలంగాణ నేపథ్యంలోని కథతో ఈ సినిమాను దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం మరో కీలక అప్‌డేట్‌ను వెల్లడించింది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి, అన్ని పనులను వేగంగా పూర్తి చేసి డిసెంబర్‌ తొలి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

వివరాలు 

నిర్మాతగా బన్నీ వాస్

ఈ చిత్రంలో శివజ్యోతి (తీన్మార్‌ సావిత్రి), జోర్దార్‌ సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చ రవి, బిత్తిరి సత్తి, అజయ్‌ బేతిగంటి, మైమ్‌ మధు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సురేష్‌ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తుండగా, సుకుమార్‌ రైటింగ్స్‌ మరియు బన్నీ వాస్‌ వర్క్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

బన్నీ వాస్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ADVERTISEMENT