హైదరాబాద్ టాకీస్ నిర్వహిస్తున్న ఇళయరాజా లైవ్ కాన్సెర్ట్
మేస్ట్రో ఇళయరాజా హైదరాబాద్ లో లైవ్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ లైవ్ కాన్సెర్ట్ ఉండనుంది. ఈ కాన్సెర్ట్ లో 100మంది సంగీత కళాకారులు పాల్గొంటున్నారు. 20వేల మంది ప్రేక్షకుల ముందు లైవ్ కాన్సెర్ట్ ఉండనుంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ టాకీస్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఐతే అంతకంటే ఒకరోజు ముందు ఫిబ్రవరి 25వ రోజున సినిమా ఇండస్ట్రీకి చెందిన సంగీత దర్శకులు, సింగర్లు ఇళయరాజా సినిమా పాటలు పాడనున్నారు. ఈ సంవత్సరంలో ఇళయరాజా 80వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు కాబట్టి ఆయన సినిమాల్లోని పాటలు పాడనున్నారు. ఈ కార్యక్రమాన్ని సినిమా సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.
లైవ్ కాన్సెర్ట్ నిర్వహిస్తున్న హైదరాబాద్ టాకీస్
ఇళయరాజాను హైదరాబాద్ కు తీసుకొచ్చే కార్యక్రమాన్ని హైదరాబాద్ టాకీస్ చూసుకుంటోంది. వీళ్ళు 2017లో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తో లైవ్ కాన్సెర్ట్ నిర్వహించారు. 2019లో సింగర్ అరిజిత్ సింగ్ తో కాన్సెర్ట్ నిర్వహించారు. 2020ఫిబ్రవరిలో సిద్ శ్రీరామ్ చేత 60వేల మంది ప్రేక్షకుల సమక్షంలో లైవ్ కాన్సెర్ట్ నిర్వహించారు. ప్రస్తుతం ఇళయరాజాను తీసుకొస్తుండడంతో హైదరాబాద్ టాకీస్ బృందం ఉత్సాహంగా ఉంది. ఇళయరాజా సంగీతాన్ని ప్రత్యక్షంగా వినడమనేది జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిన అద్భుతమనీ హైదరాబాద్ టాకీస్ కో పౌండర్ దీప్తి చెప్పుకొచ్చారు. మై మ్యూజిక్ మై కంట్రీ (#m3c) అనే నినాదంతో సంగీత ప్రియుల కోసం సంగీత కళాకారులతో లైవ్ కాన్సెర్ట్స్ నిర్వహిస్తూ ఉంటుంది హైదరాబాద్ టాకీస్.