తల్లి కాబోతున్న ఇలియానా: బేబీ బంప్ వీడియోను ఇన్స్ టా లో షేర్
హీరోయిన్ ఇలియానా, తాను తల్లి కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఇలియానాకు ఇంకా పెళ్ళి కాలేదు. గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ లో ఉండి ఆ తర్వాత విడిపోయింది. ప్రస్తుతం కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ మిచెల్ లారెంట్ తో రిలేషన్ లో ఉంటుందని టాక్. తాను ప్రెగ్నెంట్ అనీ, పాప కొసం ఎదురుచూస్తున్నాని సోషల్ మీడియా వేదికగా నెలక్రితం పోస్టు పెట్టింది ఇలియానా. తాజాగా తన బేబీ బంప్ ని చూపిస్తూ చిన్నపాటి వీడియోను రిలీజ్ చేసింది. చేతిలో కాఫీ మగ్ పట్టుకుని బేబీ బంప్ ని చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో, ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోకు రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
బాయ్ ఫ్రెండ్ విషయాన్ని దాచి పెట్టిన ఇలియానా
ఇలియానా ఎవరితో రిలేషన్ షిప్ లో ఉందని కామెంట్లలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పటివరకు ఆ విషయాన్ని ఇలియానా వెల్లడి చేయలేదు. ఇలియానా తల్లి కాబోతున్న విషయాన్ని ఆమె తల్లి కూడా కన్ఫామ్ చేసింది. మనవరాలి కోసం వెయిట్ చేస్తున్నానంటూ కామెంట్ చేసింది. దేవదాసు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా, ఆ తర్వాత పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. తెలుగులో ఒక వెలుగు వెలిగిన ఇలియానా, బాలీవుడ్ లో అవకాశం రావడంతో టాలీవుడ్ కు టాటా చెప్పేసింది. చివరగా ఆమె నటించిన తెలుగు చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ, 2018లో విడుదలైంది.