LOADING...
Dulquer Salmaan: లగ్జరీ కార్ల అక్రమ రవాణా.. దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో ఈడీ సోదాలు
లగ్జరీ కార్ల అక్రమ రవాణా.. దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో ఈడీ సోదాలు

Dulquer Salmaan: లగ్జరీ కార్ల అక్రమ రవాణా.. దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో ఈడీ సోదాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ స్టార్ నటులు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నివాసాల్లో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించిన విషయం ఇప్పటికే తెలిసిందే. ఈ దాడులు లగ్జరీ కార్ల అక్రమ రవాణా (స్మగ్లింగ్) కేసులో చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 'ఆపరేషన్ నమకూర్' పేరుతో లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌పై దర్యాప్తు చేపట్టిన కస్టమ్స్ అధికారులు, కేరళలోని పలువురు ప్రముఖుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కోచి, తిరువనంతపురం ప్రాంతాల్లోని పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో, పనంపిల్లి నగర్‌లోని దుల్కర్ సల్మాన్ నివాసంలో కూడా తనిఖీలు జరిగాయి.

Details

ఇళ్లపై ఈడీ సోదాలు

అయితే ఆ సోదాల సమయంలో వీరి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఏ లగ్జరీ వాహనాలు కనుగొనబడలేదని అధికారులు పేర్కొన్నారు. తాజాగా దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ నివాసాలపై ఈడీ సోదాలు కూడా జరుగుతున్నాయి, ఇది చర్చనీయాంశంగా మారింది. భూటాల్ ఆర్మీ కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించగా, కొంతమంది ఏజెంట్లు వాటిని వేలంలో దొంగతనం చేసి, కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా భారత్‌కు రవాణా చేశారనే టాక్ వినిపిస్తోంది. సినీ, వ్యాపార వర్గాలలో కొందరికి మాత్రమే లగ్జరీ కార్ల విక్రయం జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Details

ఇంకా స్పందించని స్టార్ నటులు

ఈ విషయం మీద పృథ్వీరాజ్, దుల్కర్ ఎవరు కూడా ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే కొద్ది రోజుల క్రితం వీరి ఇళ్లతో పాటు కోచి, కొజికోడ్, మలప్పురం వంటి కేరళలోని వివిధ ప్రాంతాల్లో కూడా కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తు ద్వారా కొన్నేళ్లుగా కొనసాగుతున్న లగ్జరీ కార్ల అక్రమ రవాణాపై అధికారులు మరింత లోతుగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా పలువురు ప్రముఖుల పేర్లు వెలుగు చూసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా, కస్టమ్స్, ఈడీ సోదాలతో పలు ప్రముఖుల హృదయాల్లో ఆందోళన నెలకొంది.