Yatra 2 Sonia role : యాత్ర 2లో సోనియా గాంధీ పాత్రను పోషించనున్న ఎవరో తెలుసా?
వైఎస్స్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 2019లో వచ్చిన 'యాత్ర' మూవీ ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రానికి సీక్వెల్ యాత్ర 2 ను తెరకెక్కించాడు. మలయాళ స్టార్ మమ్ముట్టి, తమిళ నటుడు జీవా ప్రధాన నటులుగా ఈ సీక్వెల్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. చిత్ర బృందం మంగళవారం సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను సోనియా గాంధీ పాత్ర ఉన్నట్లు, ఆ పాత్రను జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోనియా గాంధీ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
సోనియా గాంధీ పాత్రలో నాలుగోసారి నటిస్తున్న సుజానే బెర్నెర్ట్
ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ సోనియా గాంధీ పాత్రలో నటించడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. ఆమె గతంలో ప్రధానమంత్రి సిరీస్, 7 RCR సిరీస్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రంలో సోనియా గాంధీ పాత్రను పోషించారు. ఇంతకుముందు పోషించిన పాత్రల్లో ఆమె అచ్చం సోనియా గాంధీ మాదిరిగానే ఉంటడంతో.. యాత్ర 2 సినిమాలో కూడా సుజానే బెర్నెర్ట్‌నే తీసుకున్నారు. యాత్ర 2 అనేది ఎంగేజింగ్ పొలిటికల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.