Loading...
Sumanth: 'మహేంద్రగిరి వారాహి' కోసం వినూత్న ప్రమోషన్.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలు!
'మహేంద్రగిరి వారాహి' కోసం వినూత్న ప్రమోషన్.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలు!

Sumanth: 'మహేంద్రగిరి వారాహి' కోసం వినూత్న ప్రమోషన్.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో సుమంత్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహేంద్రగిరి అనే రహస్య ప్రాంతం, వారాహి దేవి దివ్యశక్తి చుట్టూ సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై కాలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాపై మరింత హైప్ తీసుకురావడానికి చిత్రబృందం వినూత్న ప్రమోషనల్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో వారాహి దేవి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు ప్రకటించింది.

వివరాలు

త్వరలోనే విడుదల తేదీ అధికారిక ప్రకటన

సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు హాల్‌లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే భక్తిభావంతో కూడిన ప్రత్యేక అనుభూతిని పొందేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ ప్రత్యేక కార్యక్రమానికి శుక్రవారం హైదరాబాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్ వేదిక కానుంది.

వారాహి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో హీరో సుమంత్‌తో పాటు చిత్రబృంద సభ్యులు కూడా పాల్గొననున్నారు.

ఈ విభిన్న ప్రచార కార్యక్రమం సినిమాపై అంచనాలను మరింత పెంచడంతో పాటు, ప్రేక్షకులకు థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని అందించనుందని మేకర్స్ భావిస్తున్నారు.

త్వరలోనే 'మహేంద్రగిరి వారాహి' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, ఆలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ADVERTISEMENT