మంగళవారం సినిమా: పాన్ ఇండియా రేంజ్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న చిత్రం మంగళవారం. ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న మంగళవారం సినిమా రిలీజ్ తేదీని రేపు ఉదయం 10:30గంటలకు ప్రకటించబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలు వెల్లడి చేశాయి. కాంతారా సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో, నందితా శ్వేత, దివ్య, అజ్మల్, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రావణ్ రెడ్డి, కృష్ణ చైతన్య నటిస్తున్నారు.