Subrahmanyam: సంగీత దిగ్గజం సుబ్రమణ్యంకు అంతర్జాతీయ గుర్తింపు.. శ్రీలంక ఘన సత్కారం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు, పద్మవిభూషణ్ డాక్టర్ లక్ష్మీనారాయణ సుబ్రమణ్యంకు శ్రీలంక ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది. కొలంబోలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే తరఫున ఆ దేశ సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ హినిడుమ సునిల్ సెనెవి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును సుబ్రమణ్యంకు అందజేశారు. శాస్త్రీయ సంగీతానికి లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం అందించిన విశిష్ట సేవలతో పాటు సంగీతం ద్వారా ప్రపంచ సమైక్యతను పెంపొందించేందుకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
వివరాలు
జాఫ్నాలోని ఓ రహదారికి ఆయన పేరు
ఈ సందర్భంగా సుబ్రమణ్యం 'గ్లోబల్ ఫ్యూజన్' పేరుతో ప్రత్యేక సంగీత కచేరీ నిర్వహించి ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీలంకకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు హేమపాల పెరెరా, రవిబంధు విద్యాపతి తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఆయనకు మరో అరుదైన గౌరవం కూడా లభించింది.
జాఫ్నాలోని ఓ రహదారికి 'వయొలిన్ మాస్ట్రో లక్ష్మీ నారాయణ రోడ్' అని పేరు పెట్టి శ్రీలంక ప్రభుత్వం ఆయన సేవలను ప్రత్యేకంగా గుర్తించింది.