Loading...
Irumudi: మనసుల్లో నిలిచిపోయే సినిమా 'ఇరుముడి'
మనసుల్లో నిలిచిపోయే సినిమా 'ఇరుముడి'

Irumudi: మనసుల్లో నిలిచిపోయే సినిమా 'ఇరుముడి'

వ్రాసిన వారు Moogati Shabari
Aug 23, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

''అందరి మనసుల్లో నిలిచిపోయే సినిమా 'ఇరుముడి'' అని హీరో రవితేజ అన్నారు. రవితేజ, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. బేబీ నక్షత్ర, సాయి కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని శనివారం చెన్నైలో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు.

వివరాలు

నటుడిగా ప్రయాణం అక్కడి నుంచే..

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ''తమిళ సినిమాతో నాకు చాలా అనుబంధం ఉంది.

నటుడిగా నా ప్రయాణం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. 'ఇరుముడి' మనసులు గెలిచిన సినిమా.

ఈ సినిమాపై మొదటి నుంచి నాకు చాలా నమ్మకం ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో జీవీ ప్రకాశ్‌ అందించిన సంగీతం ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.

నక్షత్ర భవిష్యత్తులో పెద్ద స్టార్‌ అవుతుంది. ప్రియా కూడా ఈ సినిమాలో చాలా సహజంగా నటించింది.

ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లలోనే చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మీ మనసుల్లో పెట్టుకుంటారు'' అని అన్నారు.

వివరాలు

ప్రతి ఒక్కర్నీ వెంటాడే చిత్రం ఇరుముడి..

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ''సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ వెంటాడే చిత్రమిది.

ఇందులో ఆధ్యాత్మికత, కుటుంబం, క్రైమ్‌.. ఇలా మూడు కోణాలు ఉన్నాయి.

ఇవి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. త్రినాథ్‌ పాత్రలో రవితేజ నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది'' అని అన్నారు. నిర్మాత రవిశంకర్‌ మాట్లాడుతూ.. ''మేము ఆశించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ విజయాన్ని ఆ అయ్యప్ప స్వామి అందించారు.

'ఇరుముడి' అందరికీ గుర్తుండిపోయే కల్ట్‌ క్లాసిక్‌ చిత్రంగా నిలిచిపోతుంది'' అని అన్నారు.

ఈ సక్సెస్‌మీట్‌లో ప్రియా భవానీ శంకర్‌, జీవీ ప్రకాశ్‌ కుమార్‌, నక్షత్ర తదితరులు పాల్గొన్నారు.

ADVERTISEMENT