Loading...
Iran: అమెరికాపై గెలిచాం.. ఇక యుద్ధం ముగియాలి: ఇరాన్
అమెరికాపై గెలిచాం.. ఇక యుద్ధం ముగియాలి: ఇరాన్

Iran: అమెరికాపై గెలిచాం.. ఇక యుద్ధం ముగియాలి: ఇరాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాపై తమ విజయాన్ని ప్రపంచం గుర్తించిందని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ పేర్కొన్నారు. తమ విజయాన్ని అంతర్జాతీయ సమాజం అంగీకరించిన నేపథ్యంలో ఇక యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. పెజెష్కియాన్‌ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇరాన్‌ మీడియా కథనాలను ప్రసారం చేసింది. హర్మూజ్‌ జలసంధిపై నియంత్రణ కొనసాగించడం, అమెరికా విధించిన షరతులకు అంగీకరించకపోవడాన్ని ఇరాన్‌ తమ విజయంగా భావిస్తోందని ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధాన్ని ముగించి తదుపరి దశకు వెళ్లాలని ఇరాన్‌ భావిస్తున్నట్లు తెలిపింది.

వివరాలు

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇరాన్

మరోవైపు ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని తాము భావిస్తున్నప్పటికీ.. అమెరికా కోరుకుంటున్న షరతులకు ఇరాన్‌ ఇంకా అంగీకరించేందుకు సిద్ధంగా లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు.

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయిందని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా హర్మూజ్‌ జలసంధి ప్రాంతంతో పాటు ఇరాన్‌ సరిహద్దుల వద్ద పూర్తి నియంత్రణ ప్రస్తుతం అమెరికా చేతుల్లోనే ఉందని ట్రంప్‌ వెల్లడించారు.

దీంతో ఇరాన్‌ యుద్ధాన్ని ముగించాలని చెబుతుండగా.. అమెరికా మాత్రం తమ షరతులకు ఇరాన్‌ అంగీకరించాల్సిందేనని స్పష్టం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT