Telangana: తెలంగాణ సచివాలయంలో సరికొత్త వ్యవస్థ.. రూ.26.81 కోట్లతో సోలార్ కార్ పార్కింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సచివాలయంలో రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న సోలార్ కార్ పార్కింగ్ వ్యవస్థ పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోలార్ ప్యానెల్స్‌తో కూడిన షెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. సోలార్ పార్కింగ్ వ్యవస్థ ద్వారా సచివాలయానికి అవసరమైన 90 వేల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని మంత్రి తెలిపారు. దీంతో సచివాలయం నెలవారీ విద్యుత్ బిల్లులో సుమారు 16 శాతం వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. సచివాలయంలో శనివారం ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సోలార్ కార్ పార్కింగ్, సీఆర్‌ఐఎఫ్ పనులు, వివిధ వంతెనల నిర్మాణ పురోగతిపై అధికారులతో చర్చించారు.
వివరాలు
పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి
సచివాలయంలోని ఉత్తర భాగంలో రెండు వరుసల్లో, దక్షిణ భాగంలో మూడు వరుసల్లో, పశ్చిమ భాగంలో ఒక వరుసలో సోలార్ ప్యానెల్స్‌తో కూడిన కార్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ డిజైన్లకు సంబంధించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే సేతుబంధన్ పథకం కింద రూ.76 కోట్లతో చేపడుతున్న నార్కెట్‌పల్లి వంతెన పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి సూచించారు.
నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ లింగారెడ్డి, సీఈలు వసంత్ నాయక్, వనజ తదితరులు పాల్గొన్నారు.