Irumudi OTT : 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్‌పై తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. 'ఇరుముడి' సినిమా సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వివరాలు
ఆకట్టుకుంటున్న ఎమోషనల్ సీన్స్..
ఈ సినిమాలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు.
సాయికుమార్, బేబీ నక్షత్ర, స్వాసిక తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
కథ, యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'ఇరుముడి' స్ట్రీమింగ్ కానుందనే వార్తతో రవితేజ అభిమానుల్లో సందడి మొదలైంది.
వివరాలు
'ఇరుముడి' కథేంటి?
'ఇరుముడి' సినిమాలో త్రినాథ్ పాత్రలో రవితేజ కనిపించారు. సీలేరు ప్రాంతంలోని పోలూరు అనే పల్లెలో ట్రక్ ఆటో నడుపుతూ.. మరోవైపు అరటి వ్యవసాయం చేస్తుంటాడు.
అతడికి అక్కడ రెండు ఎకరాల అరటి తోట ఉంటుంది. తన కుమార్తె మణికంఠ అలియాస్ మణెమ్మే (బేబీ నక్షత్ర) అంటే త్రినాథ్‌కు ప్రాణం. ఆమెనే తన లోకంగా భావిస్తూ జీవిస్తుంటాడు.
తమ గ్రామంలో ఐదో తరగతి తర్వాత స్కూల్ లేకపోవడంతో.. తన కుమార్తె చదువును కూడా ఆపేయాలని త్రినాథ్ ఒక దశలో భావిస్తాడు.
అంతగా కుమార్తెపై ప్రేమను చూపిస్తాడు. గ్రామస్తులతోనూ ఎంతో సఖ్యతగా ఉంటాడు.
మరోవైపు నిత్యం మద్యంసేవించే త్రినాథ్.. కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించి 41 రోజుల పాటు ఎంతో నిష్ఠగా పూజలు చేస్తుంటాడు.
వివరాలు
గ్రామాన్ని వెంటాడుతున్న సమస్య ఏంటి?
తన కుమార్తెకు ఎలాంటి కష్టం రాకుండా అయ్యప్ప స్వామి కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది మాల ధరిస్తుంటాడు.
అంతేకాదు.. గ్రామంలో ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా తన కుమార్తెలాగే భావించి ఆమెకు అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తుంటాడు.
ఈ క్రమంలో అనుకోకుండా అతడి గురుస్వామి (సాయికుమార్) కుమార్తె గాయత్రి ఒకరోజు కనిపించకుండా పోతుంది.
అసలు గాయత్రికి ఏమైంది? ఆమెను త్రినాథ్ సహాయంతో గ్రామస్తులు గుర్తించారా? లేదా? అసలు ఆ గ్రామాన్ని వెంటాడుతున్న సమస్య ఏమిటి? అన్నదే సినిమాలో ఆసక్తికరంగా చూపించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే 'ఇరుముడి' సినిమాను చూడాల్సిందే.