Loading...
Spirit: అంత సీన్‌ ఉందా? 'స్పిరిట్‌'పై రివ్యూయర్లకు నిర్మాత ప్రణయ్‌ రెడ్డి ఛాలెంజ్
అంత సీన్‌ ఉందా? 'స్పిరిట్‌'పై రివ్యూయర్లకు నిర్మాత ప్రణయ్‌ రెడ్డి ఛాలెంజ్

Spirit: అంత సీన్‌ ఉందా? 'స్పిరిట్‌'పై రివ్యూయర్లకు నిర్మాత ప్రణయ్‌ రెడ్డి ఛాలెంజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా రివ్యూలతో ఒక చిత్ర స్థాయిని తగ్గించలేరని నిర్మాత ప్రణయ్‌ రెడ్డి అన్నారు. ఆయన నిర్మించిన 'రోమాంచకం' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాపై వచ్చిన విమర్శలపై ప్రణయ్‌ రెడ్డి స్పందించారు. ఒక ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వెనుక ఎంతో మంది కష్టం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న అప్‌కమింగ్‌ చిత్రం 'స్పిరిట్‌' (Spirit) గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ''నిర్మాణ రంగంలో ఉన్నవారికే ఆ కష్టాలు తెలుస్తాయి. ఒక రైటర్‌ రాసిన కథను తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు ఎంత కష్టపడతాడో, షూటింగ్‌ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అందరికీ అర్థం కాదు.

వివరాలు

ఏడాదిన్నర పాటు వర్క్ చేసిన సందీప్ 

'రోమాంచకం' సినిమా రివ్యూ విషయంలో కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరించారు.

వారికి నిజంగా అంత సామర్థ్యం ఉంటే.. రాబోయే 'స్పిరిట్‌' స్థాయిని తగ్గించగలరా?'' అని ప్రణయ్‌ రెడ్డి (Pranay Reddy Vanga) సవాల్‌ విసిరారు. ఇక హైఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 'స్పిరిట్‌' విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తోంది.

ఈ సినిమాలో తొలుత దీపికను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం దర్శకుడు సందీప్‌ ఆమెతో ఏడాదిన్నర పాటు వర్క్‌ చేశారు.

అయితే ఆ తర్వాత దీపిక స్థానంలో త్రిప్తి దిమ్రీని తీసుకున్నారు.దీపికను ప్రాజెక్ట్‌ నుంచి తప్పించిన సమయంలో.. ఆమె ఈ సినిమా కథను లీక్‌ చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.

వివరాలు

వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్

ఈ పరిణామాలతో 'స్పిరిట్‌'పై విడుదలకు ముందే ఆసక్తి నెలకొంది.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ వంగా రూపొందిస్తున్న ఈ సినిమా హైఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT