Loading...
Telangana: తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. రెండేళ్లలో రూ.70 వేల కోట్లు
తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. రెండేళ్లలో రూ.70 వేల కోట్లు

Telangana: తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. రెండేళ్లలో రూ.70 వేల కోట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో గత రెండేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. దావోస్‌లో రూ.5.86 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 108 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వాటన్నింటినీ కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ పెట్టుబడులకు అనుగుణంగా రాష్ట్ర యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. జీసీసీలు, డేటా సెంటర్ల ఏర్పాటుకు త్వరలో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరిస్తున్నామని చెప్పారు.గ

వివరాలు

23 శాతం ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభం

శుక్రవారం శాసనసభలో ఐటీ పరిశ్రమలు, తెలంగాణ రైజింగ్‌ సమిట్‌ ద్వారా వచ్చిన పెట్టుబడులకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

''తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌లో కుదుర్చుకున్న ఎంవోయూలలో 23 శాతం ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి.

అలాగే గత రెండేళ్లలో దావోస్‌ పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాల్లో దాదాపు 45 శాతం కార్యకలాపాలు ప్రారంభించాయని శ్రీధర్‌బాబు తెలిపారు.

రెండేళ్లలో హైదరాబాద్‌లో 75కి పైగా గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ప్రారంభమయ్యాయని చెప్పారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు.

గత ప్రభుత్వం ప్రధాన కంపెనీలు, పరిశ్రమల భాగస్వామ్యం లేకుండా ఐటీ హబ్‌లు, టవర్లను నిర్మించడంతో అవి నిరుపయోగంగా మారాయని శ్రీధర్‌బాబు విమర్శించారు.

వివరాలు

భారాస ఫ్యూచర్‌ లేని పార్టీ.. ఫ్యూచర్‌ సిటీపై మాట్లాడటం హాస్యాస్పదం

ప్రస్తుతం వాటిని వినియోగంలోకి తీసుకొస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఆదిలాబాద్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.

నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

బీఆర్ఎస్ భవిష్యత్తు లేని పార్టీ అని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీ ఫ్యూచర్‌ సిటీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కకూడదనే దురుద్దేశంతో పారిశ్రామికవేత్తలను భారాస అడ్డుకుంటోందని ఆరోపించారు.

నాటి భారాస ప్రభుత్వం ఫార్మా సిటీ పేరుతో కాలుష్యాన్ని వెదజల్లే రెడ్‌ కేటగిరీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిందని శ్రీధర్‌బాబు విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం హరిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

ఐటీ కంపెనీల భూములతో స్థిరాస్తి వ్యాపారాలు: దానం

తెలంగాణ రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని శ్రీధర్‌బాబు ఆరోపించారు.

ఈ అంశంపై భాజపా సభ్యులు చొరవ తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్‌-బెంగళూరు రహదారిని రక్షణ కారిడార్‌గా కేంద్రం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. ఐటీ కంపెనీలకు కేటాయించిన భూములను స్థిరాస్తి వ్యాపారాలకు ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు.

ఈ భూముల విషయంలో సరైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

తన మిత్రుడు హైదరాబాద్‌లో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని, అయితే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించకపోవడంతో వెనక్కి తగ్గారని దానం నాగేందర్‌ తెలిపారు.

పరిశ్రమలను ప్రోత్సహించకపోతే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

ADVERTISEMENT