Loading...
Donald Trump: 'మేం గెలిచేందుకే పోరాడుతున్నాం'.. ఇరాన్‌తో యుద్ధాన్ని సమర్థించుకున్న ట్రంప్
'మేం గెలిచేందుకే పోరాడుతున్నాం'.. ఇరాన్‌తో యుద్ధాన్ని సమర్థించుకున్న ట్రంప్

Donald Trump: 'మేం గెలిచేందుకే పోరాడుతున్నాం'.. ఇరాన్‌తో యుద్ధాన్ని సమర్థించుకున్న ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్థించుకున్నారు. అల్‌ఖైదా ఉగ్రసంస్థ 2001లో అమెరికాపై నిర్వహించిన ఉగ్రదాడికి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను ఆయన ప్రస్తావించారు. ''నాడు ఉగ్రవాదంపై జరిగిన పోరులో పాల్గొన్న ప్రతి అమెరికా సైనికుడికి సెల్యూట్‌ చేస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచంలో ఉగ్రవాదానికి నంబర్‌ వన్‌ స్పాన్సర్‌గా ఉన్న ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం దక్కకుండా మా సైనికులు కృషి చేస్తున్నారని ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌ విషయంలో అమెరికా సైనిక చర్యలను కొనసాగించడానికి కారణాన్ని వివరిస్తూ.. ''మేం గెలిచేందుకే పోరాడుతున్నాం. మా దగ్గర మరో అవకాశం లేదు. అందుకే నేటికీ మేం యుద్ధం చేస్తున్నామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT