Loading...
Suddala Ashok Teja: ప్రముఖ కవి సుద్దాల అశోక్‌ తేజకు ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారం
ప్రముఖ కవి సుద్దాల అశోక్‌ తేజకు ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారం

Suddala Ashok Teja: ప్రముఖ కవి సుద్దాల అశోక్‌ తేజకు ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ ఏటా ప్రదానం చేస్తున్న రాష్ట్ర స్థాయి బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక 'తెలంగాణ తెలుగు తేజం' సాహిత్య పురస్కారం-2026కు ప్రముఖ కవి, జాతీయ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ ఎంపికయ్యారు. ఈ మేరకు పురస్కార కమిటీ ఛైర్మన్‌, అవార్డు వ్యవస్థాపకుడు కెప్టెన్‌ డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి, తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి శుక్రవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

వివరాలు

తెలంగాణ తెలుగు తేజం పురస్కారం అందజేత

'తెలంగాణ తెలుగు తేజం' పురస్కార ప్రదానోత్సవాన్ని ఈ నెల 22న కరీంనగర్‌ పట్టణంలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

తెలుగు భాషకు తెలంగాణ మట్టి బిడ్డలు అందించిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు పురస్కార కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

ADVERTISEMENT