NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే బయటకు వచ్చేస్తోంది? కారణమేంటంటే? 
    తదుపరి వార్తా కథనం
    గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే బయటకు వచ్చేస్తోంది? కారణమేంటంటే? 
    గుంటూరు కారం నుండి పూజా హెగ్డే తప్పుకుందని వార్తలు

    గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే బయటకు వచ్చేస్తోంది? కారణమేంటంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 20, 2023
    04:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాకు కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది. గతకొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరగట్లేదని సమాచారం.

    తాజా వివరాల ప్రకారం, ఈ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకుందని వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే పూజా హెగ్డే చాలా రోజులు కేటాయించిందని, అయినా కూడా తన పార్ట్ షూటింగ్ పూర్తవలేదని టాక్.

    ఈ సినిమా వల్ల వేరే సినిమాలను పూజా వదులుకుందని, అటు ఆ సినిమాలు పోయి, ఇటు ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం తనకు ఇబ్బందిగా అనిపిస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.

    అందుకే సినిమా నుండి తప్పుకుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక సమాచారం రాలేదు.

    Details

    థమన్ కూడా అదే బాటలో?

    కేవలం పూజా హెగ్డే మాత్రమే కాదు, గుంటూరు కారం సినిమా కోసం వచ్చిన ఇతర ఆర్టిస్టులు సైతం ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారని అంటున్నారు.

    ఈ సినిమా షూటింగ్ అనుకున్న తేదీల్లో జరక్కపోవడం వల్ల, తాము మరిన్ని డేట్స్ ఇవ్వాల్సి వస్తుందని, దానివల్ల వేరే సినిమాలు పోతున్నాయని ఫీల్ అవుతున్నారని టాక్ నడుస్తోంది.

    అలాగే సంగీత దర్శకుడు థమన్ కూడా గుంటూరు కారం నుండి తప్పుకుంటున్నాడని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

    ఈ వార్తలకు సెటైరికల్ గా తన సోషల్ మీడియా ఖాతాలో, బనానా, బట్టర్ మిల్క్ పోస్టులు పెట్టాడని నెటిజన్లు చెబుతున్నారు. అసలు గుంటూరు కారం సినిమాలో ఏం జరుగుతుందో క్లారిటీ లేదు ఏదో గందరగోళం ఉందని అర్థమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహేష్ బాబు
    గుంటూరు కారం
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మహేష్ బాబు

    వారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా? సినిమా
    మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ? తెలుగు సినిమా
    SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు సినిమా
    #SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు తెలుగు సినిమా

    గుంటూరు కారం

    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు

    తెలుగు సినిమా

    ఆర్ఆర్ఆర్ హీరోలతో నటించాలనుందని చెప్పిన హాలీవుడ్ యాక్టర్  ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్  బాలకృష్ణ
    ఆమెను చూడగానే కన్నీళ్ళు పెట్టుకుని కాళ్ళమీద పడిపోయిన సిద్ధార్థ్  సినిమా
    ఓజీ సెట్లోకి పవన్ కళ్యాణ్ ఆగమనం: యాక్షన్ సీన్లపై ఫోకస్  పవన్ కళ్యాణ్

    సినిమా

    ఇండియన్ 2: ఎస్ జే సూర్యను ఢీ కొట్టనున్న కమల్ హాసన్?  తెలుగు సినిమా
    సుడిగాలి సుధీర్ హీరోగా కాలింగ్ సహస్ర సినిమా: చిత్ర గొంతులోంచి జాలువారిన మొదటి పాట రిలీజ్  తెలుగు సినిమా
    విమానం రివ్యూ: కొడుకు కోరికను తీర్చాలనుకునే తండ్రి కథ ఎలా ఉందంటే?  మూవీ రివ్యూ
    తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే మాయాబజార్ విశేషాలు తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025