థమన్ ని మార్చేసారా? బట్టర్ మిల్క్, బనానా ట్వీట్ల అర్థమేంటి?
టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో మొదటి స్థానంలో ఉండే పేరు, ఎస్ ఎస్ థమన్. ట్రోల్స్ లోనూ థమన్ పేరే ముందు వరుసలో ఉంటుంది. తాజాగా థమన్ పై అనేక వార్తలు వస్తున్నాయి. ఒక స్టార్ హీరో సినిమా నుండి థమన్ ను తొలగించారని, చెన్నై నుండి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటు పుకార్లు వస్తున్న సమయంలోనే, సోషల్ మీడియాలో థమన్ పోస్ట్ చేసిన ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి. బనానా గురించి ట్వీట్ చేసిన థమన్, కడుపు మంటను తగ్గించుకోవడానికి అరటి పండు బాగా పనిచేస్తుందని అన్నాడు.
సెటైరికల్ ట్వీట్స్ అంటున్న నెటిజన్లు
అలాగే, తన స్టూడియో దగ్గర బట్టర్ మిల్క్స్ స్టాల్ పెడుతున్నట్లు, కడుపు మంటతో బాధపడేవాళ్ళు అక్కడికి వెళ్ళి బట్టర్ మిల్క్ తాగొచ్చని ట్వీట్ చేసాడు. ఈ రెండు ట్వీట్లు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. తనపై వస్తున్న ట్రోల్స్ పై సెటైరికల్ గా థమన్ ఇలా ట్వీట్స్ పెట్టాడని నెటిజన్లు అంటున్నారు. వీటన్నింటి మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చారా లేదా అన్న విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. అదలా ఉంచితే, థమన్ ప్రస్తుతం బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు, పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకతంలో రూపొందుతున్న ఓజీ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారన్న సంగతి తెలిసిందే.