Ravindra Jadeja : రాజస్థానీ వేషధారణలో జడేజా రాయల్ ఎంట్రీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా టోర్నీపై పడింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీ మార్చి 28 నుంచి ప్రారంభమవుతుందని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. గత సీజన్ వరకు చైన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ట్రేడ్ డీల్‌లో భాగంగా సంజు శాంసన్ సీఎస్కేకు ఇచ్చి, జడేజాను రాజస్థాన్ ఫ్రాంచైజీ తమ జట్టులోకి తీసుకుంది.
Details
ప్రత్యేక వీడియో విడుదల
ఈ నేపథ్యంలో జడేజాకు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సుమారు 84 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో జడేజా సంప్రదాయ రాజస్థానీ వేషధారణలో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇక జడేజా ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. అతను 2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫునే తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు.
Details
చెన్నై సూపర్ కింగ్స్‌తో 12 సీజన్లు
ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌తో 12 సీజన్లు, గుజరాత్ లయన్స్ తో 2 సీజన్లు ఆడాడు. ఇప్పుడు మళ్లీ తన తొలి ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్‌లోకి చేరడం ప్రత్యేకంగా నిలిచింది. 2008లో షేన్ వాట్సన్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో జడేజా కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఆ జట్టుకు రెండు సీజన్ల పాటు ప్రాతినిధ్యం వహించిన జడేజా.. మొత్తం 22 ఇన్నింగ్స్‌ల్లో 430 పరుగులు చేసి, 6 వికెట్లు కూడా పడగొట్టాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
𝐊𝐡𝐚𝐦𝐦𝐚 𝐆𝐡𝐚𝐧𝐢, 𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 🔥⚔️
— Rajasthan Royals (@rajasthanroyals) March 10, 2026
Ravindrasinh Jadeja has arrived for IPL 2026 💗 pic.twitter.com/fVUVl5zTjZ