Jailer 2 Movie Review: జైలర్ 2 ఫస్ట్ రివ్యూ.. రజనీకాంత్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా?
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం 'జైలర్ 2'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, ఎస్.జే. సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, మిర్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి అతిథి పాత్రల్లో సందడి చేయనున్నట్లు సమాచారం. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మూడేళ్ల క్రితం విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న 'జైలర్'కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాల్లో సినిమాకు సెన్సార్ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది.
వివరాలు
జైలర్ 2 సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
భారత్లో 'జైలర్ 2' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. సినిమా నిడివి సుమారు 2 గంటల 45 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది.
సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉన్న కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ సభ్యులు సూచించారట.
అభ్యంతరకరంగా భావించిన కొన్ని డైలాగులను మ్యూట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
ఒకటి రెండు సన్నివేశాలు మినహా మిగతా అంశాలపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకుండానే సినిమాకు అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
వివరాలు
కథేంటి?
ఇటీవల లండన్లో ఈ సినిమా ప్రివ్యూ ప్రదర్శించినట్లు ప్రచారం జరుగుతోంది.
దీంతో 'జైలర్ 2' కథ, కథనాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
కథ విషయానికొస్తే.. తన కొడుకు మరణం తర్వాత రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండ్యన్ (రజనీకాంత్) తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు.
భార్య విజయ పాండ్యన్ (రమ్యకృష్ణ), కోడలు శ్వేతా పాండ్యన్ (మిర్నా), మనవడు రిత్విక్కు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలనుకుంటాడు.
అయితే, డ్రగ్స్ మాఫియా డాన్ (మిథున్ చక్రవర్తి), అతని కుమారుడు బోధి కల్పక్ (ఎస్.జే. సూర్య), కోడలు కాంతా కల్పక్ (విద్యాబాలన్) కారణంగా ముత్తువేల్ కుటుంబానికి ప్రాణాపాయం ఏర్పడుతుంది.
వివరాలు
ఫస్టాఫ్, ఇంటర్వెల్ ట్విస్ట్పై ప్రశంసలు
ఈ పరిస్థితుల్లో తన కుటుంబాన్ని రక్షించేందుకు ముత్తువేల్ ఎలాంటి పోరాటం చేశాడు? తన స్నేహితులైన మ్యాథ్యూ (మోహన్ లాల్), నరసింహా (శివరాజ్ కుమార్), కామదేవ్ (జాకీ ష్రాఫ్)తో పాటు హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి సహాయంతో శత్రువుల ఆట ఎలా కట్టించాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశంగా తెలుస్తోంది.
ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రివ్యూ టాక్ ప్రకారం.. సినిమా ఫస్టాఫ్ రజనీకాంత్ మాస్ ఎలివేషన్లతో పాటు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ శైలిలోని కామెడీతో సాగుతుందని సమాచారం.
కథనం ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆసక్తికరంగా ముందుకు సాగుతుందని, స్క్రీన్ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కొందరు చెబుతున్నారు.
ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
జైలర్ 2పై నెగెటివ్ టాక్ కూడా!
సెకండాఫ్లో వరుస సర్ప్రైజ్లతో కథ మరింత వేగంగా ముందుకు సాగుతుందని టాక్ వినిపిస్తోంది.
క్లైమాక్స్లో హృతిక్ రోషన్తో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ప్రచారం జరుగుతోంది.
అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ఈ సినిమాపై ప్రతికూల అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
గతంలో వచ్చిన 'జైలర్' స్థాయిలో సీక్వెల్ ఆకట్టుకోలేదని కొందరు అంటున్నారు.
సినిమాలోని ట్విస్టులను ముందుగానే ఊహించగలిగేలా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
భారీ తారాగణం ఉన్నప్పటికీ, ప్రతి నటుడి పాత్రను దర్శకుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారని విమర్శలు వస్తున్నాయి.
వివరాలు
జైలర్ 2పై నెగెటివ్ టాక్ కూడా!
రజనీకాంత్ పాత్రలో ఆశించిన స్థాయిలో యాక్షన్ లేదని, ఆయనను ప్రధానంగా నిలబెట్టి సన్నివేశాలను నడిపించినట్లు అనిపిస్తోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
దీంతో సినిమాపై పాజిటివ్, నెగెటివ్ టాక్ రెండూ వినిపిస్తున్నాయి.
అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో, 'జైలర్ 2' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.