జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న బ్రిటీష్ నటి జమీలా జమీల్, వివరాలివే
బ్రిటీష్ నటి జమీలా జమీల్, ఎహ్లర్ల్ డాన్లర్స్ సిండ్రోమ్ (ఈడీఎస్) అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి వల్ల చర్మం సాగుతుంది. ఎముకను ఎముకను కలిపే కీళ్ళ మధ్య చలనం ఎక్కువగా ఉంటుంది. 36సంవత్సరాల జమీలా జమీల్, తన పరిస్థితిని ఇన్ స్టా గ్రామ్ ద్వారా అందరికీ తెలియజేసింది. తన చెంపలను లాగుతూ, చర్మం సాగుతుందని వీడియోలో చూపించింది. అలాగే చేతిని చాచి, మోచేతి దగ్గర ఎక్కువ వంగిపోయినట్లు చూపించింది. ఆ తర్వాత మాట్లాడుతూ, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్య చేయకూడదని చెప్పింది. బ్రిటన్ కి చెందిన నేషన్ హెల్త్ సర్వీస్ ప్రకారం ఈడీఎస్ అనే వ్యాధివల్ల చర్మం, ఎముకలు, రక్తనాళాలు, ఇంకా ఇతర అవయవాల్లోని కణజాలాలు దెబ్బతింటాయి.
ఈడీఎస్ లో రకాలు
ఇందులో 13రకాలున్నాయి. హైపర్ మొబైల్, క్లాసిక్, కార్డియాక్-వాల్వులార్, వాస్కులార్, ఆర్థోచలాసియా, డెర్మటోస్ పరాక్సిస్,కైపోస్కోలియోటిక్, బ్రిటిల్ కార్నియా, స్పాండిలోడిస్ ప్లాస్టిక్, మయోపథిక్, పెరియోడోంటల్ మొదలగునవి. ఒక్కో రకమైన వ్యాధిరకం ఒక్కో రకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. వాస్కులర్ కార్డియాక్ అనే రకంలో గుండె రక్తనాళాలు దెబ్బతింటే డెర్నటోస్ పరాక్సిస్ లో చర్మం దెబ్బతింటుంది. చర్మానికి సంబంధించిన దానివల్ల చర్మం సాగే గుణాన్ని సంతరించుకుంటుంది. చర్మ నిర్మాణానికి కారణమయ్యే కొల్లాజెన్ అనేది సరిగ్గా ఉత్పత్తి కాకపోవడమే దీనికి కారణం. ఈ రకమైన వ్యాధులు 5వేలమందిలో ఒక్కరికి వస్తాయి. జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తాయి. చర్మం సాగుతూ ఇబ్బంది పెడుతుంతే దాన్ని బిగుతుగా మార్చే వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తారు.