NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సలార్ సినిమాకు జేమ్స్ బాండ్ ఫీల్స్
    తదుపరి వార్తా కథనం
    సలార్ సినిమాకు జేమ్స్ బాండ్ ఫీల్స్
    ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న సలార్

    సలార్ సినిమాకు జేమ్స్ బాండ్ ఫీల్స్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 31, 2023
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేజీఎఫ్ తో బాక్సాఫీసును షేక్ చేసిన దర్శకుడు, ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడోనని ఆశగా, ఆతృతగా ఉన్నారు.

    వాళ్ళందరినీ ఆశ్చర్యపర్చడానికి సలార్ సినిమాకు జేమ్స్ ఆండ్ ఫీల్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. విషయమేంటంటే, ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్, ఇటలీ దేశంలో మతేరా పట్టణంలో జరుగుతోంది.

    ఈ ప్రాంతంలో జేమ్స్ బాండ్ చిత్రమైన నో టైమ్ టు డై సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరెకెక్కించారు. అదే ప్రాంతంలో సలార్ ను తెరకెక్కిస్తుండడంతో ఆసక్తిగా మారింది.

    మతేరా మాత్రమే కాదు, ఇటలీలో ప్రముఖ నగరాలైన రోమ్ లో కూడా సలార్ షూటింగ్ జరగనుందని వినిపిస్తోంది.

    సలార్

    డ్యుయల్ రోల్ లో కనిపించనున్న ప్రభాస్

    మతేరాలో జరుగుతున్న యాక్షన్ సీక్వెన్సెస్ లో పృథ్వీరాజ్ సుకుమార్ పాల్గొంటున్నారట. అదలా ఉంచితే, సలార్ లో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు.

    ఈ విషయమై ఎలాంటి సమాచారం అధికారికంగా రానప్పటికీ, సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జరుగుతోంది. అంతేకాదు, సలార్ లో కేజీఎఫ్ హీరో యష్, అతిధి పాత్రలో కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    శృతి హాసన్ హీరోయిన్ గా కనిపిస్తున్న సలార్ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

    యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న సలార్ చిత్రం, 2023 సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    తెలుగు సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ప్రభాస్

    సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ప్రకటన: ఆ సినిమాల పరిస్థితి ఏంటి? తెలుగు సినిమా
    అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర పేజీల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడమే సినిమా
    సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు సినిమా

    తెలుగు సినిమా

    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు చిత్ర పరిశ్రమ
    బాలయ్య సినిమాకు కొత్త అందం, అనిల్ రావిపూడి అదరగొట్టేస్తున్నడా? బాలకృష్ణ
    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నో నో నో అంటూ అప్డేట్ ఇచ్చేసారు సినిమా
    ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ ఎన్టీఆర్ 30
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025