శ్రీరామ నవమి కానుకాగా ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్: ట్రోల్స్ కి చెక్ పెట్టేసినట్టే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. రామాయణాన్ని ఈతరం ప్రేక్షకులకు సరికొత్తగా చూపించడానికి దర్శకుడు ఓం రౌత్ సిద్ధం చేస్తున్నారు.
తాజాగా ఆదిపురుష్ నుండి శ్రీరామ నవమి కానుకగా ఒక పోస్టర్ రిలీజైంది. సాధారణంగా ఇళ్ళలో ఉండే రాముడి ఫోటోలా ఉంది ఈ పోస్టర్. బాణం రాముడు పట్టుకుని రాముడు నిల్చుంటే, ఎడమ వైపున సీత, కుడివైపు లక్ష్మణుడు ఉన్నారు.
వారి ముందు మోకాళ్ళ మీద కూర్చుని దండం పెడుతూ హనుమంతుడు కనిపించారు. ఈ పోస్టర్ చాలా అద్బుతంగా ఉంది. నిజంగా ఆ రాముడిని చూసినట్టుగా ఉంది.
మంత్రం కన్నా నీ నామమే గొప్పది శ్రీరామ అనే సందేశాన్ని చెబుతూ పోస్టర్ ని విడుదల చేసారు.
ఆదిపురుష్
ప్రభాస్ అభిమానుల్లో ఆహ్లాదాన్ని నింపిన పోస్టర్
చూస్తుంటే ఈ పోస్టర్ తో గతంలో వచ్చిన ట్రోల్స్ కి చెక్ పెట్టేసినట్టే అనిపిస్తోంది.
ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేసినపుడు విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. రామాయణంలోని పాత్రలను సరిగ్గా చూపించలేదని ట్రోలింగ్ చేసారు.
ఆ ట్రోల్స్ ని దృష్టిలో ఉంచుకున్న ఆదిపురుష్ టీమ్, ఆదిపురుష్ చిత్రానికి రిపేర్లు చేయడం ప్రారంభించిందని, అందుకే సినిమా విడుదలను వాయిదా వేసారని అన్నారు.
ఇప్పుడు రిలీజైన పోస్టర్ చూస్తుంటే రిపేర్లు నిజంగానే జరిగినట్టుగా తోస్తుంది. ఏదైతేనేం శ్రీరామ నవమి రోజున ఆదిపురుష్ నుండి ఆహ్లాదకరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
దీంతో ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఆదిపురుష్ చిత్రం, జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.