OG: పవన్ కళ్యాణ్ ఓజీలో జపనీస్, థాయ్ యాక్టర్లు..
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల్లో "ఓజీ" (They Call Him OG) అనే ప్రాజెక్ట్ అత్యంత క్రేజీగా ఉంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం థాయిలాండ్, బ్యాంకాక్‌లో లొకేషన్లపై నెట్టింట చిత్రాలు వైరల్‌గా మారాయి. తాజాగా, సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికరమైన వార్తను పంచుకున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ జపనీస్ నటుడు కజుకి కిటముర, పేరున్న థాయ్ యాక్టర్ విథయా పంస్రింగారం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పవన్ కొత్త అవతారంతో సినిమాపై అంచనాలు
రవి కే చంద్రన్ ఈ యాక్టర్లతో కలిసి తీసిన ఫొటోలను పంచుకున్నాడు. ఇది చిత్రంలోని పాత్రలు, ఈ క్రేజీ యాక్టర్ల పాత్రలు ఏమిటి అనే ఉత్కంఠను పెంచింది. దీంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. "ఓజీ"లో గ్యాంగ్ లీడర్ సినిమాతో పాపులర్ అయిన ప్రియాంకా ఆరుళ్ మోహన్ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, శ్రియారెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. "ఓజీ"కు సంబంధించిన మొదటి గ్లింప్స్‌ను "HUNGRYCHEETAH" పేరుతో మేకర్స్ రిలీజ్ చేసి, పవన్ కల్యాణ్ కొత్త అవతారంతో సినిమాపై అంచనాలు పెంచారు.