Loading...
Ram Gopal Varma: ఏఐ వాడని వాళ్ల ఉద్యోగాలు గల్లంతే.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
ఏఐ వాడని వాళ్ల ఉద్యోగాలు గల్లంతే.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

Ram Gopal Varma: ఏఐ వాడని వాళ్ల ఉద్యోగాలు గల్లంతే.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంపై 'ఏఐ ట్రూత్ బాంబ్' పేరుతో సుదీర్ఘ విశ్లేషణను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏఐని ఉపయోగించే వ్యక్తులు.. దానిని ఉపయోగించని వారి స్థానాలను భర్తీ చేస్తారని స్పష్టం చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతున్నాయన్న ఆందోళనపై తన అభిప్రాయాలను ఘాటుగా వెల్లడించారు. ఉద్యోగ రంగంలో ఏఐ ప్రభావం గురించి వర్మ మాట్లాడుతూ.. ''చాలా మంది ఉద్యోగులు ఏఐ తమ ఉద్యోగాలను దొంగిలిస్తోందని గట్టిగా అరుస్తున్నారు. కానీ నిజానికి వారే తమను తాము దొంగిలించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

వివరాలు

ఎవరూ ఒప్పుకోవడం లేదు

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కోడ్ రాయడానికి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కొత్త ఐడియాల కోసం, అనలిస్టులు డేటా విశ్లేషణకు చాట్‌జీపీటీ, క్లాడ్, మిడ్‌జర్నీ వంటి ఏఐ టూల్స్‌ను రహస్యంగా ఉపయోగిస్తున్నారని వివరించారు.

వాటి సాయంతో చేసిన పనిని తామే కష్టపడి పూర్తి చేసినట్లు పైఅధికారుల ముందు ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ దీన్ని రహస్యంగా చేస్తున్నారు. కానీ ఎవరూ ఒప్పుకోవడం లేదు. అయితే కంపెనీలకు ఈ విషయం గణాంకాల రూపంలో తెలిసిపోతుందని వర్మ అన్నారు.

ఏఐ వినియోగం వల్ల కంపెనీల పని సామర్థ్యం పెరిగిందని, అవుట్‌పుట్, నాణ్యత మెరుగుపడ్డాయని, లాభాలు కూడా పెరిగాయని తెలిపారు.

ADVERTISEMENT