Page Loader
Jr NTR : వారం రోజులుగా జపాన్'లోనే జూనియర్ ఎన్టీఆర్.. జపాన్ భూకంపంపై ఏమన్నారంటే 
జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారంటే

Jr NTR : వారం రోజులుగా జపాన్'లోనే జూనియర్ ఎన్టీఆర్.. జపాన్ భూకంపంపై ఏమన్నారంటే 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jan 02, 2024
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్ దేశంలో భూకంపం ప్రకంపణలు సృష్టించింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జపాన్(Japan) లోని చాలా ప్రాంతాల్లో భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో వచ్చిన భూకంపం జపాన్ దేశాన్ని వణికించింది. భూకంప ధాటికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ మేరకు జపాన్ త్వరగా కోలుకోవాలని ప్రపంచ దేశాల నుంచి ప్రార్ధించారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ జపాన్'లో ఉండటం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. గతవారం రోజులుగా ఎన్టీఆర్ ఆ దేశంలోనే ఉన్నారు. RRRతో చరణ్, ఎన్టీఆర్'లకు జపాన్'లోనూ అభిమానులు ఏర్పడ్డారు.దీంతో ఆ దేశానికి వెళ్లిన ఎన్టీఆర్, ఫ్యామిలీతో జాలీగా గడిపారు. గత రాత్రి హైదరాబాద్ వచ్చేసిన ఎన్టీఆర్,భూకంపంపై X వేదికగా స్పందించారు.బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జపాన్ దేశంలో భూకంపంపై ఎన్టీఆర్ ట్వీట్