జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ ప్రయాణం: కుటుంబంతో కలిసి వెళ్తున్న ఆర్ఆర్ఆర్ హీరో
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి పయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పిల్లలు, భార్యతో కలిసి వెళ్తున్న ఫోటోలు ఇంటర్నెట్లో దర్శనం ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ వెళ్తున్నారని విషయం బయటకి వచ్చింది. దుబాయ్ ప్రయాణం ఎందుకంటే? సైమా అవార్డుల పురస్కార ప్రధానోత్సవం దుబాయ్ లో జరుగుతుంది కాబట్టి ఆ వేడుకకు హాజరు కావడానికి ఎన్టీఆర్ పయనమయ్యారు. ప్రతీ ఏడాది దక్షిణాది భాషల సినిమాలకు అవార్డులు అందిస్తుంది సైమా. ఈసారి ఈ కార్యక్రమం దుబాయ్ లో జరుగుతుంది. సైమా అవార్డు నామినేషన్లలో ఆర్ఆర్ఆర్ నుండి ఉత్తమ నటుడు విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. అలాగే రామ్ చరణ్ కూడా ఈ నామినేషన్లలో చోటు దక్కించుకున్నారు.
సైమా అవార్డుల నామినేషన్లు
తెలుగు సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు 11కేటగిరీల్లో నామినేషన్లు దక్కాయి. అలాగే యుద్ధంతో రాసిన ప్రేమకథతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సీతారామం సినిమాకు 10విభాగాల్లో నామినేషన్లు దక్కాయి. ఇటు కన్నడ సినిమాలో కేజీఎఫ్ 2, కాంతారా సినిమాలకు 11విభాగాల్లో నామినేషన్లు దక్కాయి. ఇటు తెలుగు సినిమాల్లో బెస్ట్ యాక్టర్ విభాగంలో ఆర్ఆర్ఆర్ హీరోలతో పాటు నిఖిల్, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్ కూడా నామినేషన్లలో ఉన్నారు. ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమాలు: కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.