Page Loader
మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్: ముహూర్తం ఎప్పుడంటే? 
సాయంత్రం 7:02గంటలకు రిలీజ్ కానున్న ఎన్టీఆర్ 30

మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్: ముహూర్తం ఎప్పుడంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
May 19, 2023
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈరోజు సాయంత్రం 7:02గంటలకు ఎన్టీఆర్ 30 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. మిగతా పాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారనేది వెల్లడి చేయాల్సి ఉంది. అనిరుధ్ రవి చందర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్ ఈరోజే