మ్యాడ్ ట్రైలర్: నవ్వుల పువ్వులు పూయిస్తున్న కాలేజ్ డ్రామా
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం మ్యాడ్.
సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్న మ్యాడ్ చిత్ర ట్రైలర్ ని జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేసారు.
ట్రైలర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. కాలేజ్ డేస్ లో ఉండే ఫన్, కంగారు వంటి వాటిని ట్రైలర్ లో చూపించారు.
చూస్తుంటే మ్యాడ్ సినిమా మంచి నవ్వులు పంచే విధంగా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
మ్యాడ్ టీజర్ లో కనిపించిన కొన్ని అడల్ట్ సీన్లు, ట్రైలర్ లో ఎక్కడా కనిపించలేదు. పూర్తి క్లీన్ సినిమాగా ట్రైలర్ ని చూపించారు.
ఫ్యామిలీ అందరూ కలిసి చూడగలిగిన చిత్రంలా ట్రైలర్ ని తీర్చి దిద్దారు.
Details
ప్రత్యేక పాత్రలో జాతి రత్నాలు అనుదీప్
ట్రైలర్ లో హైలైట్ గా నిలిచిన మరో అంశం ఏంటంటే, జాతి రత్నాల దర్శకుడు అనుదీప్, మ్యాడ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు తమ కాలేజ్ రోజులను గుర్తు చేయడానికి, కడుపుబ్బా నవ్వించడానికి మ్యాడ్ సినిమా వస్తోంది.
సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న మ్యాడ్ సినిమాను కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసారు.
శ్రీ గౌరీప్రియ రెడ్డి, అననతిక సనిల్ కుమార్, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అక్టోబర్ 6వ తేదీన మ్యాడ్ చిత్రం థియేటర్లలో విడుదల అవుతుంది.