Page Loader
Junior NTR : మరో ఘనతను సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ నుంచి ఏకైక హీరోగా!
మరో ఘనతను సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ నుంచి ఏకైక హీరోగా!

Junior NTR : మరో ఘనతను సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ నుంచి ఏకైక హీరోగా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2023
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Ram Charan) ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించారు. ముఖ్యంగా టాలీవుడ్ రేంజ్‌ను అమాంతం పెంచేశారు. ఈ క్రమంలో గ్లోబెల్ స్టార్స్‌గా ఎదిగారు. ఇక నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబెల్ హీరోగా మారడంతో పాటు కొన్ని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ కమిటీలో స్థానం సంపాదించడంతో పాటు పలు ఇంటర్నేషనల్ మేగజైన్స్ ఫ్రంట్ పేజ్‌లపై కనిపించారు. తాజాగా మరో ఘనతను సాధించడం విశేషం. ఏషియన్ వీక్లీ న్యూస్ మేగజైన్‌కు బ్రిటన్‌లో ఎంతో పాపులారిటీ ఉంది. తాజాగా ఈస్టర్న్ ఐ పేరిట 50 ఏషియన్ స్టార్లను ప్రకటించింది. ఇందులో తారక్ కు స్థానం లభించింది.

Details

25వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్

ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ 25వ స్థానంలో ఉన్నాడు. ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక నటుడిగా ఎన్టీఆర్ నిలిచాడు. ఈ లిస్టులో షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా, పలువురు బాలీవుడ్ నటీనటులు ఇందులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు అమెరికన్ మ్యాగజైన్ 'వైరటీ' ప్రకటించి 500 మంది జాబితాలో ఎన్టీఆర్, రాజమౌళీకి చోటు లభించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేవర సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.