Page Loader
Jani Master: న్యాయం గెలుస్తుంది, నిజం బయటకి వస్తుంది: జానీ మాస్టర్‌ 
న్యాయం గెలుస్తుంది, నిజం బయటకి వస్తుంది: జానీ మాస్టర్‌

Jani Master: న్యాయం గెలుస్తుంది, నిజం బయటకి వస్తుంది: జానీ మాస్టర్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ఇటీవల ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. తప్పుడు ప్రచారాలు చేయడంపై ఆయన ఆసహనం వ్యక్తం చేశారు. తమ స్వార్థం కోసం కోర్టు ఆర్డర్లను కూడా ఇగ్నోర్ చేసి, తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తే జాలేస్తోందని ఆయన చెప్పారు. తనకు తెలియకుండా జరిగిన యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికల కేసుకు సంబంధించిన తీర్పును కూడా అనుకూలంగా మార్చి, మరొక కేసుతో జత చేసి పోస్టులు పెడితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. అసలు తీర్పు వివరాలు బయటికొచ్చినప్పుడు, ఈ దుష్ప్రచారం ఎందుకు జరిగిందో, ఎవరు చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. ఆ రోజు కూడా దూరం లేదని, త్వరలోనే నిజం బయటికొస్తుందన్నారు.

Details

చట్టపరమైన పోరాటం చేస్తా

గతేడాది జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టు కావడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను డ్యాన్స్‌ యూనియన్‌ నుంచి తొలగించినట్లు వార్తలు రావడంతో జానీ మాస్టర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. తనను శాశ్వతంగా యూనియన్‌ నుండి తొలగించడం సరికాదన్నారు. తన పదవీకాలం ఇంకా కొనసాగుతుందని, కానీ అనైతికంగా ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. దీనిపై చట్టపరమైన పోరాటం చేస్తున్నానని అని తెలిపారు.