బిడ్డకు జన్మనిచ్చాక దూకుడు పెంచిన కాజల్ అగర్వాల్: కెరీర్లో 60వ సినిమాను లాంచ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్, పెళ్ళి తర్వాత కొంత విరామం తీసుకుంది. బిడ్డకు జన్మనిచ్చేవరకు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. గతకొన్ని రోజులుగా వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటోంది. తాజాగా కాజల్ అగర్వాల్ నుండి 60వ సినిమా రాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. ఆరమ్ ఆర్ట్స్ నిర్మాణంలో కాజల్ 60వ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్, ఎవరు డైరెక్ట్ చేస్తున్నారనే విషయాలు రేపు(జూన్ 18) వెల్లడి కానున్నాయని అధికారికంగా తెలియజేసారు. మునుపెన్నడూ చూడని విధంగా కాజల్ ను చూపిస్తామని ప్రీ లుక్ పోస్టర్ లో చెబుతున్నారు. మరి కాజల్ ఎంత కొత్తగా కనిపించనుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.