Page Loader
Kalki 2: 'కల్కి 2' షూటింగ్‌ 35 శాతం పూర్తి.. సీక్వెల్‌పై మేకర్స్‌ కీలక అప్డేట్‌
'కల్కి 2' షూటింగ్‌ 35 శాతం పూర్తి.. సీక్వెల్‌పై మేకర్స్‌ కీలక అప్డేట్‌

Kalki 2: 'కల్కి 2' షూటింగ్‌ 35 శాతం పూర్తి.. సీక్వెల్‌పై మేకర్స్‌ కీలక అప్డేట్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2024
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ 'కల్కి 2898 ఏడీ'తో తెలుగు సినిమా మరో మైలురాయిని చేరుకుంది. ఈ భారీ విజయం తర్వాత, మేకర్స్‌ సీక్వెల్‌ 'కల్కి 2'పై కీలక ప్రకటన చేశారు. గోవాలో జరుగుతున్న 'ఇఫ్ఫీ' వేడుకల్లో పాల్గొన్న చిత్ర నిర్మాతలు స్వప్న-ప్రియాంక ఈ సీక్వెల్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కల్కి 2' ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, రెగ్యులర్‌ షూట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక అధికారిక ప్రకటన ఇస్తామని, 'కల్కి 2898 ఏడీ' షూటింగ్‌ సమయంలోనే సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించామని చెప్పారు.

Details

అంతర్జాతీయ స్థాయిలో విడదుల చేసేందుకు ప్లాన్

ప్రస్తుతం సీక్వెల్‌ 35శాతం షూటింగ్ పూర్తయైందని నిర్మాతలు తెలిపారు. 'కల్కి 2898 ఏడీ'లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె, సీక్వెల్‌లో కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించిన 'కల్కి 2898 ఏడీ' ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఆడియన్స్‌ను భిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లి మంత్ర ముగ్దులను చేసింది. సీక్వెల్‌ కథలో అసలు పరిణామాలు మొదలవుతాయని మేకర్స్‌ స్పష్టం చేశారు. 'కల్కి 2'ను అంతర్జాతీయ స్థాయిలో మరింత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.