NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఇండియన్ 2 కోసం నెలరోజులు షూటింగ్, కమల్ హాసన్ రెడీ
    తదుపరి వార్తా కథనం
    ఇండియన్ 2 కోసం నెలరోజులు షూటింగ్, కమల్ హాసన్ రెడీ
    నెలరోజుల పాటు చెన్నైలో షూటింగ్ జరుపుకోనున్న ఇండియన్ 2

    ఇండియన్ 2 కోసం నెలరోజులు షూటింగ్, కమల్ హాసన్ రెడీ

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 16, 2023
    04:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళ బిగ్ బాస్ సీజన్ 6 పనులు పూర్తి చేసుకున్న కమలహాసన్, ఇండియన్ 2 సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. తిరుపతిలో షూటింగ్ షెడ్యూల్ ముగించుకున్న తర్వాత ఇప్పటివరకు ఇండియన్ 2 షూటింగ్ పై ఎలాంటి అప్డేట్ రాలేదు.

    తాజాగా వచ్చిన అప్డేట్ ఇండియన్ 2 అభిమానులను ఉత్సాహ పరుస్తోంది. మరికొద్ది రోజుల్లో చెన్నైలోని అమర్నాథ్ స్టూడియోలో 30 రోజులపాటు ఇండియన్ 2 సినిమా షూటింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారిక సమాచారం రానప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

    చెన్నైలో 30 రోజుల షూటింగ్ పూర్తి చేసుకొని ఆ తర్వాత ఫారెన్ లో రెండు లేదా మూడు షెడ్యూల్స్ చేయనున్నారట.

    ఇండియన్ 2

    రామ్ చరణ్, కమల్ హాసన్ మధ్యలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న శంకర్

    దర్శకుడు శంకర్, ఇటు కమలహాసన్ తో ఇండియన్ 2 సినిమాను, అటు రామ్ చరణ్ తో మరో సినిమాను చేస్తున్నాడు. కొన్ని రోజులు రాంచరణ్ సినిమాను షూట్ చేస్తే మరికొన్ని రోజులు ఇండియన్ 2 సినిమా కోసం సమయాన్ని కేటాయిస్తున్నాడు శంకర్.

    ఇండియన్ 2 సినిమా అసలు కథ:

    1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తుంది ఇండియన్ 2. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుండగా ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

    ఈ సంవత్సరంలో షూటింగ్ పూర్తిచేసుకుని వీలైతే డిసెంబర్లో లేదా 2024 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025