Kangana Ranaut: సీక్రెట్‌గా పెళ్లి.. ఆ ప్రచారాలకు చెక్ పెట్టిన కంగనా రనౌత్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ తన పెళ్లికి సంబంధించిన ప్రచారాలపై తాజాగా స్పందించారు. మెడలో నల్లపూసలు, చేతుల్లో మట్టిగాజులు ధరించి సాంప్రదాయ వేషధారణలో కారు ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమె రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారాలపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వివరణ ఇచ్చారు. ఇటీవల క్వీన్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న క్వీన్ 2 షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించారు. ఇందులోని ఓ పాత్ర కోసం కంగనా వివాహిత మహిళ పాత్రలో కనిపించాల్సి వచ్చింది. ఆ పాత్రకు సంబంధించిన మేకప్‌లో ఉన్న సమయంలో ఎవరో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పెళ్లి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
వివరాలు
రహస్యంగా పెళ్లి చేసుకోనని చెబుతూ ఫ్యాన్స్‌కు క్లారిటీ..
ఈ నేపథ్యంలో కంగనా స్పందిస్తూ.. "నేను పాత్ర కోసం మేకప్‌లో ఉన్నప్పుడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటి నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఒక వివాహిత మహిళలా కనిపించడం అంత ఆశ్చర్యకరమైన విషయమా? నటీనటులు కథ అవసరానికి అనుగుణంగా విభిన్న పాత్రలు పోషిస్తారు. అయితే నేను రహస్యంగా పెళ్లి చేసుకునే వ్యక్తిని కాదు. అలాంటిది జరిగితే తప్పకుండా అందరికీ తెలియజేస్తాను" అని పేర్కొన్నారు.
వివరాలు
జూన్ 12న భారీగా విడుదల..
అలాగే క్వీన్ 2 వచ్చే నెల జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. రాజకీయ, సామాజిక అంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో కంగనా మళ్లీ బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తారోనని బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా వల్ల ఆమె సినీ కెరీర్ మళ్లీ టాప్ లోకి వెళ్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.