Kangana ranaut: కంగనా రనౌత్ వర్సెస్ తాప్సీ.. మళ్లీ మాటల యుద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్నుల మధ్య మాటల యుద్ధం మరోసారి తారస్థాయికి చేరింది. గతంలో తమ మధ్య తలెత్తిన విభేదాలపై తాప్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తాప్సీ చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
వివరాలు
తాప్సీ వ్యాఖ్యలపై కంగనా ఫైర్..
తాను కంగనా రనౌత్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని తాప్సీ తెలిపారు.
కంగనాపై తనకున్న అభిప్రాయం తన పెంపకం, ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
''ఆమె పద్ధతి ఆమెది. దాన్ని బట్టే ఎవరెక్కడి నుంచి వచ్చారో అర్థమవుతుంది'' అని తాప్సీ వ్యాఖ్యానించారు.
తాప్సీ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ కూడా ఘాటుగా బదులిచ్చారు. తాప్సీ తన 'బీ-గ్రేడ్' సినిమా ప్రమోషన్ కోసం మరోసారి తన పేరును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
ఎప్పటిలాగే తన పేరు ప్రస్తావిస్తూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
వివరాలు
తాప్సీ హద్దులు దాటారని కంగనా ఆగ్రహం..
తన పెంపకం, తల్లిదండ్రుల గురించి మాట్లాడటం ద్వారా తాప్సీ హద్దులు దాటారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఎప్పుడూ ఇతరుల తల్లిదండ్రులను వివాదాల్లోకి లాగనని పేర్కొన్నారు.
''ఒక అసలైన బిడ్డకు తాప్సీ తల్లిదండ్రులు ఎందుకు జన్మనివ్వలేకపోయారోనని ఆశ్చర్యంగా ఉంది.
అలాంటి చౌకబారు నకలుకు జన్మనిచ్చినందుకు వారిని చూస్తే జాలి వేస్తోంది'' అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కంగనా సోదరి రంగోలి చందేల్ తొలిసారి తాప్సీని 'సస్తీ కాపీ' అంటూ విమర్శించారు.
ఆ తర్వాత 2020లో కంగనా కూడా తాప్సీని 'బీ-గ్రేడ్' నటి అంటూ విమర్శించడంతో ఇరువురి మధ్య విభేదాలు మరింత ముదిరాయి.
తాను రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తాప్సీ ఇదే ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.