Page Loader
Kanguva: కంగువా కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. నెల ఆలస్యంగా విడుదల 
కంగువా కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Kanguva: కంగువా కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. నెల ఆలస్యంగా విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2024
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కంగువ'. ఈ సినిమా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లపై భారీ బడ్జెట్‌తో నిర్మితమైంది. సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయాలని నిర్ణయించిన ఈ సినిమా, రజినీకాంత్‌ 'వేట్టయ్యన్' విడుదల తేదీ కారణంగా వాయిదా పడింది. నేడు 'కంగువా' చిత్రబృందం కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వారు సోషల్ మీడియాలో ప్రకటించారు.

వివరాలు 

తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు

"ప్రైడ్, గ్లోరీ కోసం యుద్ధం, ప్రపంచం చూసేందుకు సిద్ధంగా ఉంది. కంగువా తుఫాన్ నవంబర్ 14న ప్రారంభమవుతుంది" అని స్టూడియో గ్రీన్‌ పేర్కొంది. ఈ ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, దిశా పటానీలు కోలీవుడ్‌లో తమ తొలి అడుగులు వేస్తున్నారు. కిచ్చా సుదీప్, యోగిబాబు, జగపతిబాబు, నటరాజన్ సుబ్రమణ్యంలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య మూడు విభిన్న రూపాలలో కనిపించబోతున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి స్పందనను అందుకుంది. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మొదటిసారిగా తమిళంలో సినిమా నిర్మిస్తున్నందున ఈ ప్రాజెక్ట్‌పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్టూడియో గ్రీన్ చేసిన ట్వీట్