తదుపరి వార్తా కథనం

kannappa postponed: 'కన్నప్ప' రిలీజ్‌కు బ్రేక్.. అభిమానులకు విష్ణు క్షమాపణలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 29, 2025
05:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప' మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరింత సమయం అవసరమవుతున్న కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రకటన చేస్తున్నందుకు అభిమానులకు, సినీ ప్రియులకు ఆయన క్షమాపణ కోరారు. తొలుత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
అయితే తాజా నిర్ణయంతో 'కన్నప్ప' కొత్త విడుదల తేదీపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.