Page Loader
Kannappa Movie: జూన్ 27న 'కన్నప్ప' విడుదల.. సీఎం యోగి సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ!
జూన్ 27న 'కన్నప్ప' విడుదల.. సీఎం యోగి సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ!

Kannappa Movie: జూన్ 27న 'కన్నప్ప' విడుదల.. సీఎం యోగి సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 09, 2025
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమైన 'కన్నప్ప' రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా కన్నప్ప మూవీ బృందం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలో కలిసింది. ఈ బృందానికి ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు నాయకత్వం వహించగా, మంచు విష్ణు, కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం యోగీకి భక్త కన్నప్ప పురాణం నేపథ్యాన్ని వివరించారు. సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.

Details

జూన్ 27న రిలీజ్

అంతేకాకుండా కన్నప్ప సినిమా ఈ ఏడాది జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని భారతీయ సినిమా చరిత్రలో ఓ గొప్ప మైలురాయిగా నిలిపేలా నిర్మిస్తున్నామని చెప్పారు. సీఎం యోగికి సినిమా నిర్మాణం, నేపథ్యం, విజువల్ ఎలిమెంట్స్ చూపించేందుకు ఓ చిన్న వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. దాన్ని చూసిన యోగీ ఆదిత్యనాథ్, చిత్ర బృందం చేసిన కృషిని ప్రశంసించారు. భారతీయ పురాణాలు, సంస్కృతి, భక్తి కథలను సినిమాల రూపంలో ప్రజలకిచ్చే ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిన విషయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, ముఖ్యమంత్రిని తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.

Details

కీలక పాత్రలో ప్రభాస్

విద్య, వారసత్వ పరిరక్షణలో విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ సమావేశం అనంతరం మంచు విష్ణు స్పందిస్తూ, యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం మా కోసం గౌరవంగా ఉంది. నా జీవితాన్ని 'కన్నప్ప' ముందు, 'కన్నప్ప' తర్వాతగా విభజించగలిగేంత ముఖ్యమైన సినిమా ఇది. ఈ చిత్రం నాకు ఒక బేబీ లాంటిది. ఇది కథ కాదని, సాంస్కృతిక పునరుత్థానమని చెప్పాలని అన్నారు. ఈ చారిత్రక చిత్రంలో విష్ణు మంచు కన్నప్పగా, ప్రీతి ముఖుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతేకాక, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్రాండ్ విజువల్స్, డివోషనల్ నేపథ్యం కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్రబృందం తెలిపింది.