NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కాంతార 2 సినిమాపై క్లారిటీ: ఈసారి వెనక్కి వెళ్ళనున్న సినిమా
    తదుపరి వార్తా కథనం
    కాంతార 2 సినిమాపై క్లారిటీ: ఈసారి వెనక్కి వెళ్ళనున్న సినిమా
    కాంతార సినిమాకు ప్రీక్వెల్ వస్తుందని తెలిపిన రిషబ్ శెట్టి

    కాంతార 2 సినిమాపై క్లారిటీ: ఈసారి వెనక్కి వెళ్ళనున్న సినిమా

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 07, 2023
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేజేఎఫ్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపిన కన్నడ చిత్రం కాంతార. నిజానికి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించలేదు, కానీ సినిమా సక్సెస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో డబ్ చేసారు.

    విడుదలైన అన్ని భాషల్లో తన సత్తా చాటుకుంది. అంతేకాదు ఆస్కార్ అవార్డుకు అన్ని అర్హతలున్న సినిమాగా రిమైండర్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఇటీవల జనవరిలో వందరోజుల పండగను పూర్తి చేసుకుంది.

    ఈ నేపథ్యంలో కాంతారా సినిమా సీక్వెల్ పై రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి స్పందిస్తూ, కాంతార 2 సినిమా ఉంటుందనీ, కాకపోతే అది కాంతార కు సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని చెప్పుకొచ్చాడు.

    సినిమా

    కాంతార 2 కాదు కాంతార 0.0

    కాంతార సినిమా కథకు ముందు భాగాన్ని ఈసారి తెరమీద చూపించనున్నారట. పంజుర్లికి సంబంధించిన చాలా సీన్స్ ప్రీక్వెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. అలాగే గుళిగ దైవం గురించి ఇంకాస్త వివరంగా ఉండబోతుందని సమాచారం.

    ఎక్కువ సీన్లు వర్షం నేపథ్యంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, 2024 రెండవ అర్థభాగంలో కాంతార ప్రీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు.

    కాంతార ప్రీక్వెల్ ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. మొత్తానికి కాంతార అభిమానులకు మంచి వార్త అందింది. మరి కాంతార ప్రీక్వెల్ ఎలాంటి మ్యాజిక్ సృష్టించనుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025