Kaantha: మొదటి రోజు కలెక్షన్స్ బాగానే రాబట్టిన 'కాంత'
ఈ వార్తాకథనం ఏంటి
దుల్కర్ సల్మాన్ హీరోగా, రానా దగ్గుబాటి నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం 'కాంత' ప్రేక్షకుల ముందుకొచ్చింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సముద్రఖని కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఆయనకు ఇది తొలి చిత్రం. విడుదలకు ముందే ప్రమోషన్స్ ద్వారా మంచి హైప్ క్రియేట్ చేసిన చిత్రబృందం, ప్రేక్షకుల దృష్టిని సినిమాపై సక్సెస్‌ఫుల్‌గా మళ్లించింది. సినిమా నవంబర్ 14న రిలీజ్ కాగా, ఒక రోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ నిర్వహించారు. తెలుగులో, తమిళంలో అయితే ప్రీమియర్స్‌ను రెండు రోజుల ముందే ప్రదర్శించారు. ఈ వ్యూహం బాగా పనిచేసింది.
Details
మొదటి రోజు రూ.10 కోట్లు పైనే
ప్రీమియర్స్ + తొలి రోజు కలిపి, 10 కోట్లు 36 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక హీరో, మరో దర్శకుడి మధ్య ఈగో వార్ ఎలా అనుకోని పరిణామాలకు దారితీస్తుందన్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందించబడింది. సినిమా రిలీజ్‌కు ముందు, తమిళ సూపర్‌స్టార్ త్యాగరాజ భాగవతార్ బయోపిక్‌గా వస్తోందన్న ప్రచారం నడిచింది. అయితే, విడుదల అనంతరం పూర్తిగా ఇది కల్పిత కథ అని తేలిపోయింది. మొత్తంగా, మొదటి రోజే 10 కోట్లు 36 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టడం పరిశ్రమ వర్గాలను ఆకట్టుకుంటోంది.