Loading...
Nani-Kayadu: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లకు కాయదు దూరం.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని కామెంట్స్!
'ది ప్యారడైజ్' ప్రమోషన్లకు కాయదు దూరం.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని కామెంట్స్!

Nani-Kayadu: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లకు కాయదు దూరం.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని కామెంట్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise). రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ ప్రమోషన్లలో హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar) కనిపించకపోవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తాజాగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వివరాలు

చెన్నై ప్రెస్ మీట్‌లో నాని క్లారిటీ

'ది ప్యారడైజ్' ప్రమోషన్స్‌లో కయాదు లోహర్ కనిపించకపోవడంపై చెన్నై ప్రెస్ మీట్‌లో నాని క్లారిటీ ఇచ్చారు. తమిళ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ ప్రశ్నకు నా దగ్గర ఒక అద్భుతమైన సమాధానం ఉంది.

కాయదు ప్రస్తుతం కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ సర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. తమిళ ప్రేక్షకుల కోసం ఒక గొప్ప చిత్రాన్ని తీస్తున్న మారి సెల్వరాజ్ సర్ ఆమెను ఈ ప్రెస్ మీట్‌కి పంపడానికి ఒప్పుకోలేదు.

అందుకే ఆమె ఇక్కడకు రాలేకపోయిందని నాని చెప్పారు.

దీంతో కయాదు లోహర్ 'ది ప్యారడైజ్' ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటానికి కారణం ఆమె మరో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటమేనని స్పష్టత వచ్చింది.

వివరాలు

హైదరాబాద్ ఈవెంట్‌కు వస్తుందా?

'ది ప్యారడైజ్' చిత్రంలో కయాదు లోహర్‌తో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

అయితే ఇప్పటివరకు 'ది ప్యారడైజ్' ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న కయాదు లోహర్.. హైదరాబాద్‌లో జరగనున్న ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అయినా హాజరవుతారా? లేదా? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.

ADVERTISEMENT

వివరాలు

నాని కామెంట్స్‌తో పుకార్లకు చెక్

చెన్నై ప్రెస్ మీట్‌లో తమిళ మీడియా అడిగిన క్లిష్టమైన ప్రశ్నకు నాని ఇచ్చిన సమాధానంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆయన సమయస్ఫూర్తితో స్పందించడంతో పాటు, ఇతర దర్శకుల పట్ల తనకున్న గౌరవాన్ని కూడా చాటుకున్నారని టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా ఓ హీరోయిన్ సినిమా ప్రమోషన్స్‌కు హాజరుకాకపోతే.. నిర్మాణ సంస్థతో విభేదాలు ఉన్నాయా? పారితోషికం విషయంలో సమస్యలు వచ్చాయా? అనే కోణాల్లో రకరకాల ఊహాగానాలు మొదలవుతుంటాయి.

అయితే నాని తెలివిగా మారి సెల్వరాజ్ ప్రాజెక్ట్ ప్రస్తావన తీసుకురావడం ద్వారా అలాంటి పుకార్లకు చెక్ పెట్టడంతో పాటు, తమిళ మీడియా వర్గాల్లో సినిమాపై సానుకూల వాతావరణాన్ని సృష్టించారని చెప్పొచ్చు.

ADVERTISEMENT

వివరాలు

'ది ప్యారడైజ్' రిలీజ్

మరోవైపు తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉన్న దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో కయాదు లోహర్ నటించడం ఆమె కెరీర్‌కు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.

అదే సమయంలో ఈ కాంబినేషన్ 'ది ప్యారడైజ్' సినిమాకు కోలీవుడ్‌లో అదనపు పబ్లిసిటీని తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.నాని మరోసారి రా అండ్ రస్టిక్ యాక్టింగ్‌తో థియేటర్లను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' సెప్టెంబర్ 24న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

అయితే ఎలాంటి ట్రైలర్‌ను విడుదల చేయకుండానే 'ది ప్యారడైజ్'ను థియేటర్లలోకి తీసుకురాబోతుండటం గమనార్హం.

ADVERTISEMENT