Loading...
Darshan: దర్శన్‌కు కొత్త చిక్కులు.. అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు
దర్శన్‌కు కొత్త చిక్కులు.. అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు

Darshan: దర్శన్‌కు కొత్త చిక్కులు.. అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 06, 2026
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు ఇబ్బందులు పెరిగే పరిస్థితి ఏర్పడింది. కేసులో 14వ నిందితుడైన ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించాడు. కేసుకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకు ప్రతిఫలంగా తనకు చట్టపరమైన విముక్తి కల్పించాలని ఆయన కోర్టును అభ్యర్థించాడు.

వివరాలు

కీలకంగా మారిన కేసు..

ప్రదోష్ వాంగ్మూలాన్ని త్వరలోనే అధికారికంగా నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అతడు వెల్లడించే వివరాలు కేసు దర్యాప్తుకు కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ముఖ్యంగా అతని వాంగ్మూలం ఆధారంగా దర్శన్‌పై ఉన్న ఆరోపణలను బలపరిచే ఆధారాలు లభించే అవకాశముందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌తో పాటు ఆయన సన్నిహితురాలిపై కూడా కేసులు నమోదయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దర్శన్‌పై హత్య, కిడ్నాప్, దాడి నేరాలకింద పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.

తొలుత కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, అనంతరం సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసింది.

ADVERTISEMENT