NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రావణుడిగా తన పేరు వినిపించడంపై కేజీఎఫ్ స్టార్ రెస్పాన్స్ ఇదే 
    తదుపరి వార్తా కథనం
    రావణుడిగా తన పేరు వినిపించడంపై కేజీఎఫ్ స్టార్ రెస్పాన్స్ ఇదే 
    రావణుడిగా నటించడంపై యశ్ క్లారిటీ

    రావణుడిగా తన పేరు వినిపించడంపై కేజీఎఫ్ స్టార్ రెస్పాన్స్ ఇదే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 22, 2023
    02:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ లో రామాయణం ఆధారంగా మరో సినిమా తెరకెక్కబోతుందని గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దంగల్, చిచోరే చిత్రాల దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో ఈ రామాయణం రూపుదిద్దుకుంటుందని టాక్.

    ఇందులో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా ఆలియా భట్ నటించనున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

    అయితే ఈ సినిమాలో రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యశ్, బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడని, అది రావణుడిగా ఉంటుందని అన్నారు.

    Details

    రావణుడి పాత్రలో నటించట్లేదని క్లారిటీ

    నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో రావణుడిగా యశ్ నటిస్తున్నాడనే వార్త వైరల్ గా మారింది. తాజాగా ఒకానొక మీడియా సంస్థతో మాట్లాడిన యశ్, ఈ విషయమై వివరణ ఇచ్చాడు.

    రావణుడిగా నటిస్తున్నానంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదనీ, వాటిని నమ్మవద్దనీ యశ్ చెప్పుకొచ్చాడు. తన తర్వాతి సినిమా గురించి మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటన ఇస్తానని అన్నాడు.

    కేజీఎఫ్ తర్వాత తన తర్వాతి సినిమాను యశ్ ఇంకా మొదలు పెట్టలేదు. అటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

    మరి యశ్, నెక్స్ట్ సినిమాపై ఎప్పుడు ప్రకటన వస్తుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    బాలీవుడ్

    ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం సినిమా
    ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత సినిమా
    5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారతదేశం
    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు సినిమా

    సినిమా

    ఆదిపురుష్ ఓటీటీ డీల్స్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే?  ప్రభాస్
    డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన కబాలి నిర్మాత కేపీ చౌదరి  టాలీవుడ్
    దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్: పాత రూట్లోకి మారుతున్న మహానటి హీరోయిన్? దిల్ రాజు
    శ్రీలీల పోస్టర్ల పర్వం: ఏడు సినిమాల నుండి రిలీజైన ఏడు పోస్టర్లు  శ్రీలీల
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025