రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ టీజర్: రణ్వీర్, ఆలియా ప్రధాన పాత్రల్లో ప్రేమకథ
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, దర్శకత్వం చేసి చాలా రోజులైపోయింది. 2016లో వచ్చిన యే దిల్ హై ముష్కిల్ సినిమా తర్వాత మళ్ళీ దర్శకత్వం వైపు రాలేదు. మధ్యలో రెండు సిరీస్ లలో చిన్న చిన్న ఎపిసోడ్స్ తెరకెక్కించాడు తప్ప ఫీఛర్ ఫిలిమ్ ని డైరెక్ట్ చేయలేదు. ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వంలో సినిమా వస్తోంది. లవ్ స్టోరీస్ ని వైవిధ్యంగా చూపించడంలో కరణ్ జోహార్ ముందుంటారు. అదే వరుసలో రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది.
25సంవత్సరాల కెరీర్ గుర్తుగా వస్తున్న చిత్రం
నిమిషం కంటే ఎక్కువ నిడివి కలిగిన ఈ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు. పూర్తిగా మ్యూజిక్ తో నింపేసాడు కరణ్ జోహార్. టీజర్ చూస్తుంటే ఎన్నో ఎమోషన్లున్న ప్రేమకథలా అనిపిస్తోంది. ఫ్యామిలీ, లవ్, రొమాన్స్, కామెడీ అన్నీ నిండి ఉన్నట్టుగా తోస్తోంది. రణ్వీర్, ఆలియా మధ్య ప్రేమకథ అందంగా ఉన్నట్టుగా టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ యాక్టర్లు అయిన ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వయాకామ్ 18, ధర్మేంద్ర ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని ప్రీతమ్ అందించారు. సినిమాల్లో కరణ్ జోహార్ కెరీర్, 25సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వస్తున్న ఈ చిత్రం, జులై 25న రిలీజ్ అవుతుంది.