Page Loader
KGF Yash: 'జై హనుమాన్' మూవీలో హనుమంతుడిగా 'కేజీఎఫ్' యష్ 
KGF Yash: 'జై హనుమాన్' మూవీలో హనుమంతుడిగా 'కేజీఎస్' యష్

KGF Yash: 'జై హనుమాన్' మూవీలో హనుమంతుడిగా 'కేజీఎఫ్' యష్ 

వ్రాసిన వారు Stalin
Feb 13, 2024
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రశాంత్ వర్మ- తేజ సజ్జ కాంబినేషన్‌లో వచ్చిన 'హను-మాన్' మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు టాలీవుడ్‌లోనూ, అటూ బాలీవుడ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' వస్తుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇది వరకే ప్రకటించారు. అయితే 'జై హనుమాన్' మూవీలో హనుమంతుని పాత్రను ఎవరు వేస్తారనే విషయమై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. హనుమంతుని పాత్రను 'కేజీఎఫ్' హీరో, కన్నడ సూపర్ స్టార్ 'యష్' పోషిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ యష్ ఈ ప్రాజెక్టులోకి ఎంటరైతే.. చాలా పెద్ద సినిమా అవుతుందని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యష్ నటించడంపై స్పందించని చిత్ర యూనిట్