LOADING...
Saraayah Malhotra: ముద్దుల పాపకు నామకరణం చేసిన కియారా-సిద్ధార్థ్.. పేరు ఏమిటంటే?
ముద్దుల పాపకు నామకరణం చేసిన కియారా-సిద్ధార్థ్.. పేరు ఏమిటంటే?

Saraayah Malhotra: ముద్దుల పాపకు నామకరణం చేసిన కియారా-సిద్ధార్థ్.. పేరు ఏమిటంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2025
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులుగా మారిన తర్వాత తొలిసారి తమ పాపను ప్రపంచానికి పరిచయం చేశారు. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన తమ కుమార్తె ఫొటోను ఈ జంట సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, ఆమె పేరును కూడా అధికారికంగా ప్రకటించారు. వారి ముద్దుల పాపకు 'సారాయహ్ మల్హోత్రా' (Saraayah Malhotra) అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. కియారా, సిద్ధార్థ్ ఇద్దరూ తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో చిన్నారి కాళ్లను చేతుల్లో ప్రేమగా పట్టుకుని ఉన్న ఒక హృదయాన్ని హత్తుకునే ఫొటోను పోస్ట్ చేశారు.

Details

శుభాకాంక్షల వెల్లువ

'మా ప్రార్థనల నుంచి... మా చేతుల్లోకి... మా దివ్య ఆశీర్వాదం, మా యువరాణి సారాయహ్ మల్హోత్రా' అనే క్యాప్షన్‌తో ఈ మధురమైన ఫొటోను వారు పంచుకున్నారు. ఫొటో బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చిన్నారి సారాయహ్‌కు అందరూ ప్రేమ పూర్వక సందేశాలు పంపుతూ, ఈ స్టార్ కపుల్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement