LOADING...
Kingdom Pre Release Event: కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. డేట్, టైమ్ ఇదే!
కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. డేట్, టైమ్ ఇదే!

Kingdom Pre Release Event: కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. డేట్, టైమ్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కింగ్‌డమ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈసినిమాలో భాగ్యశ్రీ బోర్సె, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. టీజర్, ట్రైలర్‌ లతోనే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ముందే చిత్రబృందం ప్రమోషన్స్‌లో ఊపు చూపుతోంది. ఇటీవల 'కింగ్‌డమ్ బాయ్స్' పేరుతో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి వంగా కలిసి ఓ 'పాడ్‌కాస్ట్' విడుదల చేశారు. అంతేకాదు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ నిర్వహించారు.

Details

యూసుఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్

తాజాగా చిత్రబృందం జూలై 28న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఇందులో విజయ్ దేవరకొండ చాలా కాలం తర్వాత పూర్తిగా మాస్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నాడు. నిర్మాత నాగవంశీ వెల్లడించిన వివరాల ప్రకారం కింగ్‌డమ్ సినిమా మా రెండున్నరేళ్ల కష్టం. జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి ఐదేళ్లుగా కష్టపడి రాసిన కథ ఇది. రెండు నిమిషాల ట్రైలర్‌తోనే భారీ స్థాయిలో హైప్ రావడం గర్వకారణం. ఇది తెలుగు ప్రేక్షకులకు ఓ నూతనమైన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రమవుతుందని అన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కింగ్‌డమ్ సినిమాపై భారీ క్రేజ్ నెలకొని ఉంది.